- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల వ్యవధిలో మరో 50 బస్తీ దవాఖానలు : మేయర్
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు 500 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికీ 224 బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. గురువారం జియాగూడలోని మరాఠి బస్తీ, హాసిఫ్ నగర్‌లోని సాబేర్ నగర కాలనీ, తలాప్ చంచలమ్ లోని సిద్దికీ నగర్, శాలిబండలోని కుమ్మర్ వాడి, మొగల్ పురలోని సుల్తాన్ షాహీ లలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..మరో నెల రోజుల్లోగా 50 బస్తీ దవాఖానలను ప్రారంభిస్తామన్నారు.
నగరంలోని నిరుపేద, బడుగు బలహీనవర్గాలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో భాగంగా పెద్ద ఎత్తున బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటితో పాటే మరెక్కడైనా అవసరముంటే అదనంగా కూడా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేసిన 200 బస్తీ దవాఖానలకు తోడు ఇవాళ మరో 24 బస్తీ దవాఖానలను సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ప్రతి బస్తీ దవాఖానకు ప్రతిరోజూ కనీసం 70 నుంచి 150 మందికి పైగా వివిధ ఆరోగ్య పరమైన సమస్యలపై ప్రాథమిక చికిత్స, పరీక్షల కోసం వస్తున్నారని పేర్కొన్నారు. ఈ బస్తీ దవాఖానాల్లో ఒక డాక్టర్, స్టాఫ్ నర్సు, కంపౌండర్, మలమూత్ర పరీక్షల విభాగం, అటెండర్లు ఉంటారన్నారు. నగర ప్రజలకు తక్షణ వైద్య సదుపాయం అందించడంలో బస్తీ దవాఖానలు సహాయపడుతున్నాయని, వ్యాధి తీవ్రతను బట్టి ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ తదితర ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నామని మేయర్ తెలిపారు. తమ బస్తీలోనే ప్రత్యేకంగా దవాఖానలను ఏర్పాటు చేయడం పట్ల బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు.కార్యక్రమంలో మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.