‘శ్రామిక ఐక్యతే దేశాభ్యున్నతి శక్తి’

by Shyam |
‘శ్రామిక ఐక్యతే దేశాభ్యున్నతి శక్తి’
X

దిశ సిద్దిపేట: మేడే ను పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో శుక్ర వారం “మేడే” చిత్రాన్ని ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. కార్మికుల ఆరోగ్యం శ్రమశక్తి ముందడుగు వేయాలని, ఎక్కడ శ్రామిక శక్తి వర్ధిల్లుతుందో అక్కడ దేశాభ్యున్నతి మూడుపువ్వులు ఆరుకాయలుగా వృద్ధి చెందుతుందన్నారు. నిర్లక్ష్యం వీడి అప్రమత్తమై.. కరోనాకు ఎవరూ భయపడవద్దని సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కరోనాను ఖట్టడి చేస్తుందన్నారు. అందరికి మేడే శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రామికుల కష్టానికి ప్రతిఫలం సక్రమంగా అందిననాడు సంతోషంగా మేడే ఆశయం నెరవేరినట్టుగా శ్రామికులు భావిస్తారన్నారు. ఈ మేడే ‘కరోనావైరస్ ను తుదముట్టించి’ ప్రపంచంలో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు ఐక్యత పెంపొందించాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారులు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, రహీమ్, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story