- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెంగళూరు, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి తిలక్‌మైదాన్‌లో బెంగళూరు ఎఫ్‌సీ, నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. వరుస ఓటములతో ఉన్న ఇరు జట్లకు ఈ డ్రా ఊరట కలిగించింది. టాస్ గెల్చిన బెంగళూరు కెప్టెన్ సునిల్ ఛత్రి కిక్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలో బెంగళూరు నియంత్రణలో ఉన్న బంతి క్రమంగా నార్త్ఈస్ట్ దగ్గరకు వచ్చింది. ఎక్కువ సేపు నార్త్ ఈస్ట్ ఆటగాళ్లు బంతిని సరైన పాస్‌లు ఇచ్చుకుంటూ తన నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో 27వ నిమిషంలో నార్త్‌ఈస్ట్ గోల్ చేసింది. మిడ్ ఫీల్డ్‌లో ఉన్న ఫ్రెడిరికో గలేగో బంతిని దొరకబుచ్చుకొని గోల్ పోస్తు వైపు వేగంగా దూసుకెళ్లాడు. చివర్లో లూయిస్ మచాదోకు పాస్ ఇవ్వడంతో అతడు దాన్ని ఎలాంటి పొరపాటు లేకుండా గోల్ చేశాడు. దీంతో నార్త్‌ఈస్ట్‌కు 1-0 ఆధిక్యం వచ్చింది.
తొలి అర్దభాగం ముగిసే వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. రెండో అర్దభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే బెంగళూరు ఎఫ్‌సీ గోల్ కొట్టింది. మ్యాచ్ 49వ నిమిషంలో దిమాస్ డెల్గాడో ఇచ్చిన పాస్‌ను రాహుల్ భీకే గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. ఆ తర్వత ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. కానీ ఏ జట్టు కూడా గోల్ చేయలేదు. నిర్థీత సమయానికి ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు ఫెడ్రికో గలేగో, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లాలెంగ్మావియాకు లభించింది.