‘చికెన్’ ప్రియులకు భారీ షాక్.. ఆందోళనలో బ్యాచ్‌లర్స్

by Shyam |
‘చికెన్’ ప్రియులకు భారీ షాక్.. ఆందోళనలో బ్యాచ్‌లర్స్
X

దిశ, ఆమనగల్లు : రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మటన్ ధర రూ. 600 పైగా ఉండటంతో.. మటన్ కొనుగోలు చేయలేని మధ్య తరగతి కుటుంబీకులు.. చికెన్ ధర అమాంతం పెరగడంతో అది కాస్తా తమకు అందని ద్రాక్ష గానే మిగిలిందనే వారు వాపోతున్నారు. గత వారం రోజుల క్రితం రూ. 180 ఉన్న చికెన్ ధర నేడు రూ. 280 ధర పలికి పెట్రోల్ ధరతో పోటీ పడతోంది.

పెరుగుతున్న ధరలతో నాన్ వెజ్ ప్రియులు చికెన్ షాపులకు వైపు వెళ్లడం లేదు. దీంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి. గతంలో క్వింటాలు చికెన్ అమ్మే దుకాణం ప్రస్తుతం పెరిగిన ధరలతో పది కిలోలు కూడా అమ్మలేక పోవడంతో దుకాణం అద్దెతో పాటు నిర్వహణ కష్టంగా మారిందని పలువురు దుకాణ దారులు వాపోతున్నారు. సాధారణంగా వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా చికెన్ ధర తగ్గుతుండగా ఈ సంవత్సరం కరోనా ప్రభావంతో పెళ్ళిళ్ళు, శుభకార్యలు లేక పోయినా ధరలు అమాంతం పెరగడంలో అంతర్యం ఏమిటో అర్థం కావటం లేదని పలువురు చికెన్ ప్రియులు వాపోతున్నారు.

గత సంవత్సరం కరోనా దెబ్బతో చికెన్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ఆయిన ఆశించిన రీతిలో వ్యాపారం జరిగి తమకు గిట్టుబాటు అవుతుందని భావించి చికెన్ సెంటర్ నడుపుతున్న తమకు పెరిగిన ధరతో గిట్టుబాటు లేక తమ కుటుంబాల జీవనం కష్టంగా మారిందని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో కొనుగోలు లేక దుకాణాల నిర్వహణ భారంగా మారిందన్నారు.

Advertisement

Next Story