పాతబస్తీలో సంచలనం రేపిన భారీ దారిదోపిడీ

by Sumithra |   ( Updated:2021-08-10 06:30:29.0  )
పాతబస్తీలో సంచలనం రేపిన భారీ దారిదోపిడీ
X

దిశ, చార్మినార్: పాతబస్తీ బండ్లగూడలో సినీ ఫక్కీ తరహాలో దారిదోపిడీ జరిగింది. రోడ్డుపై సైడ్ ఇచినట్టే ఇచ్చి స్వల్పంగా బైక్‌కు తగిలి దుర్భాష లాడసాగారు. వెనుక నుంచి మరో రెండు బైక్ లపై నలుగురు వ్యక్తులు పై పైకి వస్తుండడాన్ని గమనించి భయంతో పల్సర్ బైక్ తో ముందుకు దూసుకెళ్లాడు. మూడు బైక్ లపై వెంబడించిన ఆరుగురు వ్యక్తులు బండ్లగూడ లో చేస్ చేసి పట్టుకున్నారు. సినిమా తరహలో పల్సర్ బైక్ ను రౌండప్ చేశారు. దుర్భాష లాడుతూ చితకబాదారు. పర్సులో ఉన్న 30 వేల రూపాయలతో పాటు రెండు సెల్ ఫోన్ లు, పల్సర్ బైక్ తో ఉడాయించారు. అర్థరాత్రి సంచలనం రేపిన ఈ ఘటన తో పాతబస్తీ ఉలిక్కిపడింది. బాధితులు మంగళ వారం తెల్ల వారు జామున 3 గంటలకు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం …తుక్కుగూడ లేమూర్ కి చెందిన సుధాకర్ (23) ఎలియాస్ లడ్డు ప్రయివేట్ కంపెనీలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సుధాకర్ స్నేహితుడు తుక్కుగూడ సరస్వతి గూడెం కు చెందిన సురేష్ (24)స్థానికంగా వ్యవసాయ పనులు చేస్తున్నాడు. సుధాకర్ సురేష్ లు కలిసి సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మంది బిర్యానీ తినడానికి తుక్కుగూడా నుంచి షాహిన్ నగర్ రూట్ లో టి ఎస్ 07 ఎఫ్ టి ఎల్ 1328 నెంబర్ గల పల్సర్ బైక్ పై వెళ్తున్నారు. మార్గమధ్యలో షాహిన్ నగర్ వద్ద ఒక బైక్ సైడ్ ఇచినట్టే ఇచ్చి అడ్డుగా వచ్చి సురేష్ బైక్ ను చిన్నగా తగలారు. బైక్ ల పై నుంచి ఎవరు కింద పడలేదు.. ఇంతలోనే సుధాకర్ ను దుర్భాష లాడుతున్న తరుణంలోనే వెనుక నుంచి మరో రెండు బైక్ లపై నలుగురు వ్యక్తులు దగ్గరికి రావడాన్ని చూసి భయపడి ఎర్రకుంట మీదుగా బండ్లగూడ వైపు బైక్ తో ముందుకు దూసుకుపోయాడు. మూడు బైక్ లపై వెంబడించిన ఆరుగురు వ్యక్తులు బండ్లగూడ రోడ్డు వరకు సుధాకర్ ను చేస్ చేస్తూ వెంట పడ్డారు. అక్కడ పల్సర్ బైక్ ను రౌండప్ చేశారు. ఆరుగురు వ్యక్తులు దుర్భాష లాడుతూ సుధాకర్, సురేష్ లపై దాడికి దిగారు. అందులో ఒకరు ఇద్దరు జేబుల్లోంచి రెండు సెల్ ఫోన్ లను లాక్కున్నాడు. మరొకడు సుధాకర్ జేబులో 30 వేల నగదు తో ఉన్న పర్సు ను దౌర్జన్యంగా లాగేసుకున్నాడు. ఇదంతా గమంచిన సమీప దుకాణం యజమాని, అటుగా వస్తున్న మరో ఆటోడ్రైవర్ ఇద్దరు కలిసి ఘటనా స్థలికి వచ్చారు. ఇంతలోనే ఆ ఆరుగురు వ్యక్తులు సుధాకర్ పల్సర్ బైక్ తో సహా ఉడాయించారు. దుకాణం యజమాని, ఆటోడ్రైవర్ ల సహాయంతో సుధాకర్, సురేష్ లు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed