పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ధర్నా

by srinivas |
పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ధర్నా
X

దిశ, ఉత్తరాంధ్ర: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వామపక్ష నేతలు గురువారం ధర్నా నిర్వహించారు. విశాఖలో ద్విచక్ర వాహనాలను తోసుకుంటూ వినూత్న నిరసన చేపట్టారు. అటు విజయనగరం, శ్రీకాకుళంలోని ప్రధాన కూడలి వద్ద వామపక్ష నాయకులు నిరసన తెలిపారు. అనంతరం వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజీల్ ధరలు ప్రజలు భరించలేని స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా… పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదని మండిపడ్డారు. నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగాయని, గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి అయిందన్నారు.. పేద, మధ్యతరగతి ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న ట్యాక్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వామపక్ష నేతలు కోరారు.

Advertisement

Next Story

Most Viewed