- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బస్సుల కోసం పరిగిలో విద్యార్థుల భారీ ధర్నా
X
దిశ, పరిగి: పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించాలని శుక్రవారం విద్యార్థులు భారీ ధర్నా చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గేట్ వద్ద శుక్రవారం రోడ్డుపై బైఠాయించి గంటపాటు భారీ రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పరిగి ఎస్ఐ విటల్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పరిగి ఆర్టీసీ డీఎంకు ఫోన్ చేసి సమస్యను తెలియజేశారు. అంతేగాకుండా.. రేపటినుంచి పాఠశాలలకు అనుగుణంగా బస్సులను నడిపించాలని డీఎంను ఎస్ఐ కోరగా, పంపిస్తామని డీఎం హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ఐ విద్యార్థులతో మాట్లాడుతూ.. మనకు సమస్య వచ్చిందని, రోడ్లపై బైఠాయించి ఇతరులకు సమస్య సృష్టించడం సరికాదని విద్యార్థులకు, నాయకులకు సూచించారు. విద్యార్థుల ధర్నా కారణంగా రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Advertisement
- Tags
- massive dharna
Next Story