ముంబయిలో మాస్కులు మ్యాండేటరీ

by Shamantha N |
ముంబయిలో మాస్కులు మ్యాండేటరీ
X

ముంబయి:భారత ఫైనాన్షియల్ క్యాపిటల్, మహరాష్ట్ర రాజధాని ముంబయిలో మాస్కులు వాడకాన్ని మ్యాండేటరీ చేస్తూ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు పాటించనివారు కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, వారిని అరెస్టులు కూడా చేయొచ్చని ఉత్తర్వులు వెలువరించారు. ముంబయిలో బహిరంగప్రదేశాలు, కార్యాలయాలు, సమావేశాలు, వాహనాలలోపల కూర్చున్నా మాస్కులు పెట్టుకోవాల్సిందేనని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి. కెమిస్టుల దగ్గర లభించే స్టాండర్డ్ మాస్కులైనా.. లేదా హోమ్ మేడ్ మాస్కులైనా ( వాషేబుల్) సరే వినియోగించవచ్చునని గ్రేటర్ ముంబయి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ ఆ ఆర్డర్‌లో వివరించారు. సుమారు రెండు కోట్ల జనాభా ఉన్న ముంబయి, దాని సబ్ అర్బన్ ఏరియాల్లో 782 కరోనా కేసులు నమోదవ్వగా.. 50 మంది మరణించారు. నిత్యావసర వస్తువుల కోసం ఇంటి నుంచి బయటకెళ్లేటప్పుడు ప్రజలందరూ తప్పక మాస్కులు ధరించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచించిన విషయం తెలిసిందే.

Tags: maharashtra, mumbai, masks, mandatory, municipal authorities

Advertisement

Next Story

Most Viewed