- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ ఆఫీసుల్లో మళ్లీ ఆంక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. ఆఫీసుల్లోకి విజిటర్స్‌ను అనుమతించడం లేదు. అత్యవసరమైతే సదరు అధికారుల పర్మిషన్ తీసుకుని లోపలికి పంపిస్తున్నారు. వారు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే. థర్మల్ స్క్రీనింగ్ సైతం మొదలైంది. చాలా ఆఫీసుల్లో సెక్యూరిటీ వద్దే వినతులు స్వీకరించి వాటిని శానిటైజ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మాస్క్, శానిటైజర్‌ను పట్టించుకోని వారు ఇప్పుడు మళ్లీ వాటి వాడకం మొదలుపెట్టారు.
కరోనా విజృంభించిన మొదటి రోజుల్లో ఆఫీసర్ల ఛాంబర్ల వద్ద ఏర్పాటు చేసుకున్న రక్షణ వలయాలు మళ్లీ ఉపయోగంలోకి వచ్చాయి. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి విభాగాలు, ఛాంబర్లలో ఏర్పాటు చేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప విజిటర్స్‌ను అనుమతించడం లేదు. కొన్ని శాఖల్లో చాలా వరకు శాఖాపరమైన సమావేశాలను సైతం తగ్గించారు. మూకుమ్మడిగా ఏర్పాటు చేసే సమావేశాలను రద్దు చేసుకుంటున్నారు. సమావేశం తప్పనిసరి అని భావిస్తే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
వివిధ శాఖల నుంచి వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలను, ఫైళ్లను సైతం ఎంట్రీ గేటు దగ్గరే ఒక ‘డాక్’ సెక్షన్‌ను ఏర్పాటు చేసి అక్కడ శానిటైజ్ చేస్తున్నారు. కొన్ని శాఖల్లో వినతులను డెరెక్ట్‌గా కాకుండా ఆన్‌లైన్ ద్వారా పంపించాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, గర్భిణులకు ముందస్తుగా సెలవులు మంజూరు చేస్తున్నారు.