ఐబా చైర్‌పర్సన్‌గా మేరీ కోమ్

by Shiva |
ఐబా చైర్‌పర్సన్‌గా మేరీ కోమ్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా) చాంపియన్స్ అండ్ వెటరన్ కమిటీ చైర్‌పర్సన్‌గా భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ నియమించబడ్డారు. గత ఏడాది అంతర్జాతీయ కమిటీలో కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చారు. దీనిలో భాగంగా చాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆరు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన మేరీకోమ్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న మేరీకోమ్ తన నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఐబా ప్రెసిడెంట్ క్రెమ్లెమ్, ఇతర అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాక్సింగ్ చాంపియన్లు, వెటరన్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాగా, దీనికి సంబంధింని ప్యానెల్ మెంబర్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Advertisement

Next Story

Most Viewed