- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ ఉద్యోగులకు మారుతీ బంపర్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుటీ సుజుకీ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పండుగ ఆఫర్‌ను ఆదివారం ప్రకటించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థికవ్యవస్థ ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ పండుగ సీజన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు మారుతీ సుజుకీ కార్ల కొనుగోలుపై రూ. 11 వేల వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇటీవల కేంద్రం పండుగ రాయితీలను ఇచ్చిన తర్వాత, మారుతీ సుజుకి కంపెనీ వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ఈ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త కారు కొనే సమయంలో ఈ ప్రయోజనాలను అందిస్తామని, ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఇది తమవంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నామని మారుతీ సుజుకి ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో దాదాపు కోటి మంది వరకు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రయోజనాలను అందించే లక్ష్యంతొ ఈ స్పెషల్ ప్యాకేజీ ప్రవేశపెట్టామని, దీనివల్ల ఉద్యోగులు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేసే అవకాశముంటుందని ఆయన వివరించారు. ఈ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ప్రభుత్వం చర్యలకు తోడు వ్యవస్థలో అదనంగా రూ. 28 వేల కోట్ల వరకు డిమాండ్ ఏర్పడుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ సరికొత్త ఆఫర్ ఆల్టో, సెలెరియో, ఎస్ ప్రెసో, డిజైర్, బలెనో, ఎర్టిగా, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, సియజ్, ఎక్స్ఎల్6, ఎస్ క్రాస్, విటారా బ్రెజా, ఇగ్నిస్ మోడళ్ల కొనుగోళ్లపై వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.