మళ్లీ కార్ల ధరలు పెంచనున్న మారుతి సుజుకి!

by Harish |
suzuki
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి వచ్చే నెల నుంచి మరోసారి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 కారణంగా వాహనాల ధరలపై ప్రతికూల ప్రభావం అధికంగా ఉందని, ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతూనే ఉన్న కారణంగా అన్ని వాహనాలపై ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని గురువారం కంపెనీ వెల్లడించింది. ‘గత సంవత్సర కాలంగా వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల వల్ల కంపెనీ ఎక్కువ ప్రభావితమవుతోంది.

తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పటంలేదని’ ఎక్స్‌ఛేంజీ ఫైలింగ్‌లో వివరించింది. 2022, జనవరి నుంచి ధరల పెరుగుదల వివిధ మోడళ్లను బట్టి నిర్ణయిస్తామని, ఎంతమేరకు పెంచనున్నది త్వరలో వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది. కాగా, మారుతి సుజుకి ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు వాహన ధరలను పెంచింది. ఇటీవల సెప్టెంబర్‌లో 1.9 శాతం పెంచగా, కరోనా వల్ల ప్రతికూలతను తగ్గించేందుకే అని చెప్పుకొచ్చింది. ఈ వారంలోనే తన నాన్-కార్గో వేరియంట్ ‘ఈకో’ వాహనంలో ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ను అందించిన కారణంతో రూ. 8,000 పెంచింది.

Advertisement

Next Story

Most Viewed