- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండస్ఇండ్‌తో మారుతీ సుజుకి ఒప్పందం!
ముంబయి: గతంలో మందగమనం, ఈ ఏడాది కరోనా వల్ల భారీగా నష్టాలను చూస్తున్న ఆటో రంగం వాటిని అధిగమించే మార్గాలను అన్వేషిస్తున్నది. ఇందులో భాగంగా కార్ల తయారీ కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇండియా కొత్త ఫైనాన్సింగ్ స్కీమ్‌లను ప్రకటించింది. ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ఇండ్‌తో మారుతీ సుజుకి ఒప్పందం ద్వారా కారు కొనుగోలు చేసే వారికి తక్కువ వడ్డీతో రుణాలను అందించనుంది. ఈ ఒప్పందం ద్వారా కారు కొనాలనుకునే వారికి ఇండస్ఇండ్ బ్యాంక్ తక్కువ వడ్డీరేటుతో రుణాలను అందించనుంది. ఈ ఒప్పందానికి ముందే మారుతీ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తాజా ఇండస్ఇండ్‌తో ఒప్పందం ప్రకారం..కారు ఆన్‌రోడ్ ధరపై పూర్తిగా 100 శాతం రుణాన్ని ఇవ్వనున్నట్టు బ్యాంక్ స్పష్టం చేసింది. సులువైన వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తూనే, మొత్తం రుణంలో మొదటి మూడు నెలలు ఈఎంఐ రూ. లక్షకు రూ. 899 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, స్టెప్-అప్ పథకంలో ఈఎంఐ లక్షకు రూ. 1800 ఉండనుంది. అంతేకాకుండా, ఖచ్చితమైన ఆదాయ ధృవీకరణ ఉన్న వినియోగదారులకు కారును ఆన్‌రోడ్ ధరపై 100 శాతం రుణాన్ని ఇవ్వనున్నారు. అయితే, ఆదాయ ధృవీకరణ లేని వినియోగదారులకు కూడా 100 శాతం రుణాన్ని ఎక్స్‌షోరూమ్ ధరలో పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ మారుతీ సుజుకి అన్ని మోడళ్లకు వర్తిస్తుందని మారుతీ సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ తెలిపారు.