- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మారుతీ సుజుకి మే నెల విక్రయాలు 18,539 యూనిట్లు!
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి మే నెలలో మొత్తం 18,539 యూనిట్లను విక్రయించినట్టు వెల్లడించింది. వీటిలో దేశీయంగా విక్రయించినవి 13,865 యూనిట్లు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో హర్యాణాలోని మానేసర్‌లో మే 12 నుంచి, గురుగ్రామ్‌లో మే 18 నుంచి ఉత్పత్తిని పునరుద్ధరించారు. దీని తర్వాతే మే నెలలో దేశీయనంగా 13,865 యూనిట్ల విక్రయాలు జరిగాయని కంపెనీ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో దేశీయంగా 1,25,552 యూనిట్లను విక్రయించామని కంపెనీ వెల్లడించింది. మొత్తం విక్రయాల్లో ఎగుమతుల పరంగా ముంబై పోర్టు నుంచి 4,651 యూనిట్లను, టయోటా కంపెనీతో కలిసి 23 యూనిట్లను ఎగుమతి చేశామని వివరించింది. ఇక, ప్రభుత్వాల నిబంధనలను అనుసరించి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో షోరూమ్‌లను తెరిచామని, మిగిలిన చోట్ల స్థానిక నిబంధనలను అనుసరించి తెరుస్తామని పేర్కొంది.