భారీ రీకాల్ ప్రకటించిన మారుతీ సుజుకి

by Harish |
car
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి భారీగా కార్ల రీకాల్‌ను ప్రకటించింది. సియజ్, విటారా బ్రెజా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 తో పాటు ఇతర మోడల్ కార్లలోని ఇంజిన్‌లలో లోపాలు ఉన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. అన్ని కార్లలో ఈ లోపం లేదని, పెట్రోల్ వేరియంట్లలో లోపాలు గుర్తించామని కంపెనీ వివరించింది. దీనికోసం కంపెనీ 2018, మే నుంచి 2020 అక్టోబర్ మధ్య కాలంలో ఉత్పత్తి చేసినటువంటి మోదళ్లలో ఈ లోపాలు ఉన్నాయని, దీనికోసం మొత్తం 1,81,754 కార్లను రీకాల్ చేస్తున్నట్టు పేర్కొంది.

సంస్థ వినియోగదారులకు అవసరమైన భద్రతను కల్పించేందుకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ లోపాలు ఉన్న కార్లను వెనక్కి రప్పిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. లోపాలు ఉన్న కార్లలో మోటార్ జనరేటర్ యూనిట్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తామని, దీనివల్ల ఇంజిన్‌కు అదనపు శక్తి అందుతుందని కంపెనీ వివరించింది. అలాగే, రీకాల్‌కు సంబంధించి కంపెనీయే కార్ల యజమానులను సంప్రదించి, నవంబర్ 1 నుంచి లోపాలున్న వాటి విడిభాగాలను మారుస్తామని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed