- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మారుతీ సుజుకి 'స్మార్ట్ ఫైనాన్స్' ప్రారంభం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన మల్టీ ఫైనాన్స్, ఆన్‌లైన్ కార్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ ‘స్మార్ట్ ఫైనాన్స్’ను బుధవారం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి కంపెనీ రిటైల్ చైన్ నెక్సా, కస్టమర్ల విస్తరణ ప్రణాళికతో వేతన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశంలోని 30 నగరాల్లో ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..పండుగ సీజన్ తర్వాత కార్ల అమ్మకాలు ఊహించినంత దారుణంగా ఏమీలేవు, డిమాండ్ సానుకూలంగానే ఉందని చెప్పారు. ఆటో పరిశ్రమ దీర్ఘకాల స్థిరమైన డిమాండ్ ఆర్థికవ్యవస్థ, కొవిడ్-19 వ్యాక్సిన్ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ఆటో పరిశ్రమలో కార్ల బుకింగ్, ఎంక్వైరీలు భారీగా క్షీణిస్తాయని కొందరు అంచనా ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదని శశాంక్ తెలిపారు. పండుగ సీజన్‌కు తర్వాత సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని, డీలర్లు, తయారీదారుల వద్ద ప్రస్తుతం ఉన్న బుకింగ్, ఎంక్వైరీలను పరిశీలిస్తే డిసెంబర్ వాహన అమ్మకాలు మెరుగ్గానే ఉంటాయని ఆయన వివరించారు. ఆటో పరిశ్రమలో ప్రస్తుత డిమాండ్ ఆర్థికవ్యవస్థ ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే, కరోనా మహమ్మారి చుట్టూ ఉన్న సెంటిమెంట్‌పై కూడా ఆధారపడి ఉంటుందని శశాంక్ తెలిపారు. ఈ రెండు అంశాలపై కొంత అనిశ్చితి ఉంది. అయినప్పటికీ ఈ రెండూ సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. కాబట్టి రానున్న త్రైమాసికాల్లో తయారీదారులకు ఆందోళన అవసరం లేదన్నారు.