ప్లాంట్‌ల మూసివేతను మే 16 వరకు పొడిగించిన మారుతీ సుజుకి

by Harish |
ప్లాంట్‌ల మూసివేతను మే 16 వరకు పొడిగించిన మారుతీ సుజుకి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన ప్లాంట్ల మూసివేతను మే 16 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి జూన్ నెలలో జరగాల్సిన మెయింటెనెన్స్ షట్‌డౌన్‌ను కంపెనీ మే 1-9 మధ్య మూసేస్తున్నట్టు, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం మహమ్మారి పరిస్థితులు మరింత పెరిగిన కారణంగా మూసివేతను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, హర్యానాలోని గుర్‌గావ్, మనేసర్ ప్లాంట్లలో పరిమిత కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది. కాగా, ఇదివరకటి ప్రకటనలో కంపెనీ తన కర్మాగారాల్లో తక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను ఉపయోగిస్తోందని, విడిభాగాల తయారీలో మాత్రమే ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ వినియోగిస్తున్నట్టు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed