విక్రయాలబాటలో ఆ కార్ల కంపెనీ రయ్ రయ్!

by Harish |   ( Updated:2020-05-14 05:07:32.0  )
విక్రయాలబాటలో ఆ కార్ల కంపెనీ రయ్ రయ్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి అనేక కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే, దేశీయ దిగ్గజ కార్ల సంస్థ మారుతీ సుజుకీ మిగిలిన కంపెనీల కంటే జోరుగా దూసుకెళ్తోంది. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించాక అత్యధిక ఆన్‌లైన్ విక్రయాలను నమోదు చేసింది. ఇప్పటికే 5000 ఆన్‌లైన్ బుకింగ్‌లను సాధించగా, 2300 కార్లను డీలర్లకు పంపించింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కార్లను వినియోగదారులకు మరో వారం రోజుల్లో డెలివరీ చేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఇండియాలో మొత్తం 2500 టచ్ పాయింట్లను కలిగి ఉన్న మారుతీ సుజుకీ, వీటిలో మూడో వంతు ఔట్‌లెట్లలో కార్యకలాపాలను పునఃప్రారంభించినట్టు వెల్లడించింది. లాక్‌డౌన్ ఆంక్షల వల్ల మూసేసిన 1900 వర్క్‌షాప్‌ల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవా తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్ పద్ధతి మొదలుపెట్టాక పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, కొనుగోళ్లకు భారీ మద్దతు లభిస్తోందన్నారు. అలాగే.. రెడ్, ఆరెంజ్ జోన్‌ల పరిధిలోని బుకింగ్‌లకు డెలివరీలు చేయడం ప్రారంభించలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రస్తుత నెలలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన మానెసర్ ప్లాంట్ నుంచి మొత్తం 2300 కార్లను పంపించినట్టు భార్గవ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed