వధువు తండ్రికి కరోనా.. ఆగిన పెళ్లి

by Sridhar Babu |
వధువు తండ్రికి కరోనా.. ఆగిన పెళ్లి
X

దిశ, హుజురాబాద్: మరో 24 గంటల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మధ్య జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పెళ్లి కూతురు తండ్రికి కరోనా నిర్ధారణ కావడంతో పెళ్లి ఆగిపోయింది. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా వధువు తండ్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా వేయక తప్పలేదు. బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు అధికారులు.

Advertisement

Next Story