- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎత్తుది ఏముంది.. మనసుండాలి గానీ..
దిశ, వెబ్‌డెస్క్ : వారిద్దరు హైట్‌ను లైట్‌గా తీసుకున్నారు. అర్థం చేసుకునే మనసుండాలి కానీ ఎత్తుది ఏముంది అనుకున్నారు. వారి తల్లిదండ్రులూ అదే ఆలోచించారు. ఇంకేముంది.. 2 అడుగుల అబ్బాయి, 4 అడుగుల అమ్మాయి ఒకటయ్యారు. దేవుడి సాక్షిగా 7 అడుగులు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మరుగుజ్జు జంట ఆదర్శ వివాహం చేసుకున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముమ్మిడివరం గ్రామానికి చెందిన దేవరపల్లి శ్రీనుబాబు, అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన సత్యదుర్గ జన్యుపరమైన సమస్యలతో జన్మించారు. ఈ కారణంగా శ్రీనుబాబు 2 అడుగులు, సత్యదుర్గ 4 అడుగుల ఎత్తు వరకే పెరిగారు. యువకుడు డిగ్రీ పూర్తి చేయగా.. యువతి 8వ తరగతి వరకు చదివి ఆపేసింది. అయితే వీరికి పెళ్లి చేయడం తల్లిదండ్రులకు సమస్యగా మారింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు అబ్బాయి, అమ్మాయి గురించి తెలుసుకున్నారు. ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇరు కుటుంబాల సమమతితో ఆ మరుగుజ్జు జంటకు బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది ముమ్మడివరంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒకటయింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తె షేర్ అవుతున్నారు. ఈ ఆదర్శ జంటను చూసిన పలువురు ‘ఎత్తుది ఏముంది.. మనసుండాలి గానీ..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.