- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మార్క్ మామ దుకాణం 7 గంటలు బంద్.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ?
దిశ,డైనమిక్ బ్యూరో : సోమవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు అత్యంత వినియోగ సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ లు నిలిచిపోయాయి. దీంతో సామాజిక ప్రపంచం అతలాకుతలం అయింది. ఏమైందో తెలియక వినియోగదారులు జుట్టు పీక్కోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది యూజర్లు ట్విట్టర్ వేదికగా వారి కోపాన్ని చూపెట్టారు. ఈక్రమంలో #deleteFacbook అనే హాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. దీంతో మార్క్ జుకర్ బర్గ్‌కి చుక్కలు కనిపించాయనే చెప్పాలి. ఫేస్బుక్ చరిత్రలో ఇంత సేపు సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి.
మానవ జీవనంలో ఒక్కటిగా కలిసిపొయిన సామాజిక మాధ్యమాలు నిలిచిపోవడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారనే చెప్పాలి. అత్యవసర సమాచారం అందించేందుకు తిరిగి పాత విధానాలనే ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ ఏడు గంటలు ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలు నిలిచిపోవడం వల్ల సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారీ నష్టాన్ని మూటగట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా ఎక్స్ఛేంజీలో ఫేస్బుక్ షేర్లు దాదాపు 5 శాతం పతనమయ్యాయి. దీనితో ఆయన గంటల వ్యవధిలో రూ.52 వేల కోట్ల నష్టపోయినట్లు తెలిసింది. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మార్క్ జుకర్‌బర్గ్ 5వ స్థానానికి పడిపోయారు.