- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టెన్నిస్‌కు మరియా షరపోవా గుడ్‌బై..

X
మాస్కో: రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న షరపోవా బుధవారం రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు జీవితాన్నిచ్చిన టెన్నిస్‌ను ఇకనుంచి ప్రతిరోజూ మిస్సవుతాను. నా దినచర్య మొత్తం మారిపోతుంది. నా టీంను, నా కోచ్‌లను, వెన్నుతట్టి ఆటలో నన్ను ప్రోత్సహించిన వారిని.. ఇలా అందర్నీ మిస్సవుతాను. నా దారి అంతా లోయలు, మలుపులతో నిండి ఉంది. కానీ, పర్వతం చివర నుంచి వీక్షిస్తే, అపురూప ఘట్టాలన్నో కనిపిస్తున్నాయి. 28 ఏండ్ల తర్వాత.. ఐదు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు దక్కించుకున్నాను. ఇప్పుడు మరో శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నా. అందుకే టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
Next Story