సిద్దిపేటలో మావో కలకలం.. సాయంత్రంలోగా 20 లక్షల పంపాలంటూ..

by Shyam |
sarpanch
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో సర్పంచ్‌కు మావోయిస్టు జగన్ పేరుతో బెదిరింపు ఫోన్‌ కాల్ వచ్చింది. వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి ఫోన్‌లో తనకు జగన్ అనే పేరుతో బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపాడు. మావోయిస్టుల పేరుతో వచ్చిన ఫోన్‌ కాల్‌లో పార్టీ ఫండ్ 20 లక్షల డబ్బులు ఇవ్వాలని ఆయనను వారు డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈరోజు(శుక్రవారం) సాయంత్రం వరకు రూ .20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

దానికి ఆయన నేను ఒక సర్పంచ్‌ను అంత డబ్బు నేనెలా ఇవ్వగలను అని ప్రశ్నించాడు. దీనికి వారు నీ కుటుంబ నేపథ్యం మొత్తం మాకు తెలుసు.. సాయంత్రం 4.30 గంటలకు డబ్బులు మా పిల్లలకి ఇవ్వు లేకుంటే పరిణామాలు వేరే ఉంటాయి అంటూ బెదిరించారని తెలిపాడు. మావోయిస్టు పార్టీ పేరుతో బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ లక్ష్మారెడ్డి సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ ప్రవీణ్ తెలిపారు.

Advertisement

Next Story