వాళ్లిద్దరినీ విడుదల చేయండి.. మావోల వార్నింగ్

by Anukaran |   ( Updated:2020-07-22 07:57:28.0  )
వాళ్లిద్దరినీ విడుదల చేయండి.. మావోల వార్నింగ్
X

దిశ, ములుగు: ములుగు
జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపురి కాలనీలోని చర్ల – వెంకటాపురం ప్రధాన రహదారిపై పట్టపగలే తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ మావోయిస్ట్ పేరిట కర పత్రాలు వెలిసాయి. విరసం నేత వరవరరావు, వికలాంగుడైన సాయిబాబా‌లతో పాటు పన్నెండు మందిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపా, ఎన్ఐఏ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పాటించాలన్నారు. అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేఖలో డిమాండ్ చేసారు.

Advertisement

Next Story