ఇన్‌‌ఫార్మర్‌ పేరుతో గిరిజనుడి హత్య

by srinivas |
ఇన్‌‌ఫార్మర్‌ పేరుతో గిరిజనుడి హత్య
X

దిశ,విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలం నూర్మతి పంచాయతీ వాకపల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి కృష్ణారావును పెదబయలు కోరుకొండ ఏరియా మావోయిస్టు కమిటీ దారుణంగా హత్య చేసింది. పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నందుకు కృష్ణారావును హతమార్చామని మృతదేహం వద్ద మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు.

అడవిపై ఆదివాసుల హక్కులను కాలరాసి.. వనసంరక్షణ సమితి ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ గ్రామస్తులను అడివిలో పశువులు మేతకు వెళ్లకుండా, వంట చెరుకు తెచ్చు కోవటానికి తీవ్ర ఆటంకాలు ఏర్పరస్తూ పెత్తందార్లుగా వ్యవహించడం ప్రజా వ్యతిరేకమని అన్నారు. నూర్మతిలో పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ఏర్పాటు తర్వాత పోలీసులకు కృష్ణారావు పూర్తిస్ధాయిలో ఇన్ఫార్మర్‌గా మారాడని చెప్పారు.

తాజాగా ఆరెస్ట్‌లకు కృష్ణారావే కారణమని, మరి కొంత మందిని సరెండర్‌ అవ్వాలంటూ ఆయన బెదిరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులకు గిరిజనులు ఇన్ఫార్మర్‌లుగా మారవద్దనీ అన్నారు. లేకుంటే కృష్ణారావుకు పట్టిన గతే పడుతుందని లేఖలో హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed