- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. ఎస్సై మురళిని హతమార్చిన మావోయిస్టులు
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాలనార్ గ్రామంలో ఈనెల 21న ఎస్సై మురళి తాతిని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పుల్సుమ్ పారా వద్ద హత్యచేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు మావోయిస్టులు. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖను కూడా వదిలారు. ఎస్ఐ మురళి 2006 సల్వాజుడుం నుంచి ఇప్పటి వరకు(2021) DRG పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని పలు గ్రామాల్లో అమాయక ఆదివాసీ గిరిజనులను హత్య చేసిన ఘటనలతోపాటు మహిళలపై అత్యాచారం చేశాడని మావోయిస్టులు ఆరోపించారు. ఈ విషయమై అతనికి పలుమార్లు హెచ్చరికలు కూడా చేశామని, అయినా అతని ప్రవర్తన మార్చుకోకపోవడంతో ప్రజాకోర్టు నిర్వహించి చంపామని మావోయిస్టులు మృతదేహం వద్ద వదిలిన లేఖలో పేర్కొన్నారు. మురళిని క్షేమంగా విడిచి పెట్టాలని గత మూడు రోజులుగా గోండ్వానా సమితి వారు, మురళి బంధువులు విజ్ఞప్తి చేశారు. మురళిని విడిపించడానికి మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న సమయంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం