ఎన్‌కౌంటర్ మృతులకు మావోయిస్టుల అంత్యక్రియలు

by Shamantha N |   ( Updated:2021-02-22 00:20:53.0  )
ఎన్‌కౌంటర్ మృతులకు మావోయిస్టుల అంత్యక్రియలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తమ సహచరులకు అంత్యక్రియలు నిర్వహించారు మావోయిస్టులు. ఇటీవల కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ ఘటనలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు పోలీసులకు లభించినట్లు మావోయిస్టు పార్ట వర్గాలు వెల్లడించాయి. కాగా, మిగిలిన ముగ్గురి మృతదేహాలకు మావోయిస్టులు సోమవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలు గంగులూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story