సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టు వాల్‌పోస్టర్ల కలకలం..

by Shyam |
సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టు వాల్‌పోస్టర్ల కలకలం..
X

దిశ, భూపాలపల్లి : సెప్టెంబర్ 27న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పల్లెల్లో వాల్ పోస్టర్లు విడుదల చేసింది. ఈ నెల 27వ తేదిన రైతులకు వ్యతిరేకంగా వేసిన తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్, కార్మిక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పల్లెల్లో వాల్ పోస్టర్లు వెలిశాయి. కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.

వారోత్సవాలను విజయవంతం చేయండి..

ఈనెల 21 నుంచి వారం రోజుల పాటు జరిగే మావోయిస్టు సంస్థాగత ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో కోరారు. మావోయిస్టు పార్టీ ఏర్పడి సెప్టెంబర్ 21తో 17ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, దీనికి కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని ఆయన కోరారు.

మోహరించిన పోలీసులు బలగాలు..

మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సరిహద్దు గ్రామాల్లో మోహరించారు. గతవారం రోజుల నుంచి భూపాలపల్లి పోలీసుల ఆధ్వర్యంలో పల్లెల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని ప్రజలకు సూచిస్తున్నారు. వారోత్సవాల సందర్భంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి మావోయిస్టులు తెలంగాణకు రావొచ్చనే అనుమానంతో భూపాలపల్లి సరిహద్దు ప్రాంతంలో పోలీసు బలగాలు మంగళవారం నుండే మోహరించాయి. కేంద్ర ప్రభుత్వ బలగాలు, సీఆర్పీఎఫ్ బలగాలు అటవీ ప్రాంతంలో నక్సల్స్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Advertisement

Next Story

Most Viewed