- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టు అగ్రనేత భాస్కర్ డైరీ లభ్యం..
దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టు అగ్రనేత భాస్కర్ దళం కోసం గ్రేహౌండ్స్ దళాలు మంగీ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఏడు నెలలుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో గ్రౌహౌండ్స్ బలగాలకు అగ్రనేత భాస్కర్‌కు చెందిన డైరీ లభ్యమైంది. అందులో చాలా కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దానిని మీడియాకు కూడా రిలీజ్ చేసినట్లు సమాచారం.
అందులో ఎముందంటే.. తొలుత భాస్కర్ దళం ప్రాణహిత నది మీదుగా మంగీ అడవుల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. పోలీసులు మావోయిస్టుల కోసం సీరియస్‌గా దృష్టి సారించారని, ప్రభుత్వంతో సమస్యలు ఎదుర్కొంటున్నా.. మావోయిస్టులకు సహకరించేందుకు ప్రజలు జంకుతున్నారని అందులో పేర్కొన్నారు. మావోయిస్టులు ఇకపై తమకు అవసరం లేదన్న భావనతో ప్రజలున్నారని భాస్కర్ తన డైరీలో రాసుకున్నట్లు తేలింది. అంతేకాకుండా, జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో తమపై పోలీసులు ఐదుసార్లు దాడి చేశారని రాసుకొచ్చినట్లు గుర్తించారు.