రెడ్ అలర్ట్.. తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎంట్రీ.?

by Sridhar Babu |   ( Updated:2021-10-26 01:29:16.0  )
రెడ్ అలర్ట్.. తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎంట్రీ.?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. సోమవారం ములుగు జిల్లా వాజేడు మండ‌లం పేరూరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలోకి మావోయిస్టు అగ్రనేత హిడ్మా వచ్చాడనే వార్తల నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరగడం సరిహద్దుల్లో కలకలం స‌ృష్టించింది.

మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ స్పందించి, ఇది ఓ బూటకపు ఎన్‌కౌంటర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అక్టోబర్ 27న బంద్‌ను ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ-ఛతీస్‌గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టారు. అంతేకాకుండా హిడ్మా కోసం వాహనాల్లో తనిఖీ చేస్తున్నారు.

ఎన్‌కౌంటర్ జరిగిన పరిసర ప్రాంతంలో దాదాపు 30 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో వారిలో హిడ్మా ఉండే అవకాశం ఉందని గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed