ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

by Sridhar Babu |
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఛోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్కేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు డీఆర్‌జీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో తారసపడిన మావోయిస్టులు జవాన్ల వైపుకి కాల్పులు జరపడంతో ఆత్మరక్షణార్థం జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతంలో ఒక మావోయిస్టు మృతదేహం, ఏకె 47 ఆయుధం, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు 6వ నంబర్ కంపెనీ కమాండర్ సాకేత్ నురుటిగా గుర్తించినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Next Story