మావోయిస్టుల డంప్ స్వాధీనం

by srinivas |   ( Updated:2020-10-28 22:55:40.0  )
మావోయిస్టుల డంప్ స్వాధీనం
X

దిశ, వెబ్‎డెస్క్ :
ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై సమచారం రావడంతో స‌రిహ‌ద్దు భద్రతా బ‌ల‌గాలు స్వాభిమాన్ ఆంచల్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. 32 డిటోనేటర్లు, ఎస్ఎల్ఆర్, ఏకే47, ఇన్సాస్ తుపాకుల బుల్లెట్లు, మ్యాగజైన్, 3 జతల మావోయిస్టుల యూనిఫామ్‎లు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ స్పెషల్ కమిటీకి చెందిన డంప్‎గా భావిస్తున్నారు.

Advertisement

Next Story