- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది వెరీ సింపుల్.. అందం మీ సొంతం
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో చాలామంది అందానికి ఇచ్చే ఇంపార్టెంట్ అంతా ఇంతా కాదు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ విషయంలో చాలామంది చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే వీటి నుంచి సత్ఫలితాలు రాకపోవడంతో నిరాశపడుతుంటారు. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక సింపుల్ చిట్కాను సూచిస్తున్నారు. దీంతో మీరు అందంగా తయారవొచ్చని చెబుతున్నారు. అందమొక్కటే కాదు చాలా లాభాలున్నాయని చెబుతున్నారు. అదేమిటంటే.. మనకు సులభంగా దొరికే కొబ్బరి నూనెను విరివిగా వాడాలని సూచిస్తున్నారు. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలను మన సొంతమవుతాయంట. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయని, దీనిని వాడితే బరువు తగ్గడం, దంత క్షయం, చిగురువాపును నివారిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పిత్తాశయ వ్యాధి లక్షణాలను తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, శక్తిని పెంచడం, కంటి సమస్యలు రాకుండా చేయడం, రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.