- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూసైడ్ చేసుకోవాలనుకున్నా : మనోజ్ బాజ్‌పేయి
సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో.. బాలీవుడ్ చీకటి కోణాల్లో నలిగిపోయిన ఎంతోమంది బయటకొచ్చి.. తమ మనసులోని బాధలను వెళ్లబోసుకున్నారు. నెపోటిజంపై తీవ్రంగా విమర్శలు చేశారు. బాలీవుడ్ సిండికేట్ గ్యాంగ్‌గా మారిందని, సినీ పరిశ్రమ కొందరి చేతుల్లోనే ఉందని కుండబద్దలు కొట్టేశారు. ఆ క్రమంలోనే ఎంతోమంది స్టార్లు.. తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని, కానీ.. ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డామని చెప్పుకొచ్చారు. ఆ జాబితాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కూడా ఉన్నారు. తాజాగా మనోజ్ బాజ్‌పేయి కూడా తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఓ ఇంటర్య్వూలో వివరించారు.
వర్మ కాంపౌండ్ నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులు సినీ పరిశ్రమకు వచ్చినట్లే.. ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు వెండితెరకు పరిచయమయ్యారు. వర్మ ద్వారా పరిచయమైన ఓ అద్భుతమైన నటుడు ‘మనోజ్ బాజ్‌పేయి’. క్యారెక్టర్ చిన్నదా.. పెద్దదా? అని చూడకుండా.. నటనకు ప్రాధాన్యముంటే చాలు అనుకునే అతికొద్ది మంది నటుల్లో మనోజ్ ఒకరు. అందుకే ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపించే పాత్రలకు.. తనే కేరాఫ్‌గా నిలుస్తాడు. మంచి క్యారెక్టర్‌లే తనను వెతుక్కుంటూ వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌లోనూ తన నటనతో మెస్మరైజ్ చేసిన ఈ నటుడు.. తన లైఫ్‌లోని కష్టాలను ఎలా దాటుకుంటూ.. ఉన్నత శిఖరాలను అధిరోహించాడో వివరించాడు.
‘సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. తొలిసారి తొమ్మిదో ఏట సిటీకి వెళ్ళాను. థియేటర్లో సినిమా చూడటంతో అమితాబ్‌పై ఆరాధనా భావంతో పాటు నటుడిని కావాలనే కసి పెరిగింది. నటుడిగా మారడం కష్టమైన పనని తెలిసినా కూడా నటనే నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అని భావించాను. 17వ ఏట ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళిన నేను అక్కడ థియేటర్‌లో చేరాను. ఇక అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు చాలా కృషి చేశాను. ఆ తర్వాత నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు అప్లై చేశాను. కానీ మూడు సార్లు తిరస్కరించదాంతో.. చాలా బాధపడ్డాను. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్స్ వల్లే చేసుకోలేకపోయాను.
ముంబైలో మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. అవకాశాల కోసం రోజూ తిరిగేవాణ్ణి. ఆ సమయంలో నా ఎదురుగానే నా ఫోటోలు చించేసినా సందర్భం కూడా ఉంది.. షూటింగ్ మధ్యలోనే నన్ను వెళ్ళిపొమ్మన్న ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్క అవకాశం కోసం.. నాలుగేళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత మహేష్ భట్ టీవీ సిరీస్‌లో ఓ అవకాశం వచ్చింది. ప్రతి ఎపిసోడ్‌కు నాకు రూ .1500 ఇచ్చేవారు. కొద్ది రోజుల తర్వాత సినిమా ఆఫర్ వచ్చింది. వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘సత్య’ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు’ అని మనోజ్ బాజ్‌పేయ్ అన్నారు. సత్య సినిమాలో నటనకు గానూ మనోజ్ బాజ్‌పేయి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ‘నేషనల్ అవార్డు’ అందుకున్నారు.
‘‘ సత్య తర్వాత.. ఎన్నో అవార్డులు నన్ను వరించాయి. నేను కొత్త ఇల్లు కొనుకున్నాను. ఇప్పటివరకు 67చిత్రాలు చేశాను. నా కలలు ఈ రోజు నిజమయ్యాయంటే దానికి కారణం.. నా కష్టాలు కాదు.. ఓ తొమ్మిదేళ్ల బీహారి కుర్రాడికి అతడిపై అతనికున్న నమ్మకం మాత్రమే’ అని మనోజ్ అన్నారు.