మంజులా రెడ్డికి ‘బెస్ట్ కరోనా వారియర్’అవార్డు

by Sridhar Babu |   ( Updated:2020-10-28 10:17:24.0  )
మంజులా రెడ్డికి ‘బెస్ట్ కరోనా వారియర్’అవార్డు
X

దిశ, హుస్నాబాద్: రెడ్డి JAC వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డికి ‘ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్’ ఉత్తమ అవార్డు ప్రదానం చేసింది. బుధవారం సంస్థ ప్రెసిడెంట్ నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించింది.

ఆ సమయంలో కరోనా పాజిటివ్ పేషెంట్లతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలకు, ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు తన సొంత ఖర్చుతో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారని గుర్తుచేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఆమె అందించిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ‘ఉత్తమ కరోనా వారియర్’ అవార్డు ప్రదానం చేసిందన్నారు.

మంజులారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతని అన్నారు.ఎవరికైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటే తమను సంప్రదించాలని ఆమె తెలిపారు. మంజులారెడ్డికి అవార్డు రావడం పట్ల ప్రజా ప్రతినిధులు, సామాజిక సేవా కార్యకర్తలు, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed