ప్రయత్నించే వరకు తెలియదు : మంజిమా

by Jakkula Samataha |
ప్రయత్నించే వరకు తెలియదు : మంజిమా
X

‘సాహసం శ్వాసగా సాగిపో’ హీరోయిన్ మంజిమా మోహన్.. తమిళ్‌లో మంచి ఆఫర్స్ దక్కించుకుంటోంది. తాజాగా విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’లో నటిస్తున్న ఆమె.. ఈ చిత్ర తొలి సన్నివేశం చిత్రీకరణ సమయంలో జరిగిన అనుభవాన్ని పంచుకుంది.

‘ఈ చిత్రంలో సర్జరీ జరిగిన తర్వాత తొలిసారి కాళ్ల మీద నిలబడాల్సిన ఒక సన్నివేశం ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ అంతకు ముందెప్పుడూ చేయలేదు కాబట్టి చాలా నర్వస్‌గా అనిపించింది’ అని చెప్పింది. డైరెక్టర్ ఢిల్లీ ప్రసాద్.. తన దగ్గరకు వచ్చి సీన్ వివరించాడని.. ఎలాంటి సహాయం లేకుండా ఫస్ట్ టైమ్ నడిచినప్పుడు ఎలా అనిపిస్తుందో.. అలాంటి భావోద్వేగాలు కావాలని చెప్పాడు. కానీ ఆ సీన్ చేసేందుకు తాను ఎందుకు వర్రీ అవుతున్నానో చెప్తే.. బాధపడాల్సిన పని లేదు, నీలో ఉన్న బెస్ట్ ఇవ్వమని చెప్పారు’ అని తెలిపింది. తను అదే చేశానని.. సీన్ సూపర్‌గా వచ్చిందని తెలిపింది మంజిమా.

https://www.instagram.com/p/CCaQfXJJBjS/?igshid=19ivxe4f4e0e2

దీని వల్ల తెలుసుకున్నది ఏంటంటే.. మనం కొన్ని సార్లు ఇది చేయలేమేమో అనుకుంటామని, కానీ మనం అది చేయగలమనే విషయం ప్రయత్నించే వరకు తెలియదని అంటోంది మంజిమా.

Advertisement

Next Story