డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు

by Shyam |
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు
X

దిశ, పర్వతగిరి: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి పేదలకు అందజేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఇటీవల వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో నిరుపేదలైన బుడగ జంగాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈదునూరి వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 2006 సంవత్సరంలో నిరుపేదలకు 14 ఎకరాల భూమిని నివాస స్థలాల కోసం కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ స్థలంలో బుడగ జంగాల నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. జీవో నెంబర్ 58, 59 ప్రకారం ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఆచరణలో పెట్టి మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములకు నేటివరకు పట్టాలు ఇవ్వకపోవడం బాధకరం అన్నారు. అదే స్థలంలో ప్రభుత్వం ఇండ్లు నిర్మించి అర్హులైన పేదలకు ఇవ్వకుండా, అనర్హులకు ఇచ్చి అభాసుపాలు అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రద్దు చేసి, అధికారులు విచారణ చేసి అర్హులైన పేదలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ చందర్, రవి, యశ్వంత్, వెంకన్న జంపయ్య, సంధ్య ఎల్లమ్మ, యాకన్న, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed