- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ చీటర్.. మందకృష్ణ మాదిగ ఆగ్రహం
దిశ, ఖైరతాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో దళితుల అభ్యున్నతి అనే అంశంపై ‘మీట్ ద ప్రెస్’ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మందకృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని, మొదటి నుంచీ దళితులను మోసం చేస్తూ వస్తున్నారని విమర్శించారు. 2001లోనే కేసీఆర్ దళిత వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తాము వ్యతిరేకించామని గుర్తుచేశారు. సైద్ధాంతికంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోరాడేది తామేనని, ఏ ప్రతిపక్ష పార్టీ తమ పాత్రను పోషించడం లేదని అన్నారు. దళిత సాధికారత అంశం కూడా దళితులను మోసం చేసే కుట్రలో భాగమేనని మండిపడ్డారు. 2003 సంవత్సరంలో ఇదే అంశంపై కేసీఆర్ నేతృత్వంలో 9 అంశాలతో రూపొందించిన దళిత సాధికారత ఎక్కడ పోయిందో ప్రశ్నించాలని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు.
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకుండా మభ్యపెట్టే కార్యక్రమంలో భాగమే అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళిత సాధికారత అంటూ మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చేసిన ప్రకటన నుంచి నేటి సాధికారత వరకు అన్ని మోసపూరితమైన అన్నారు. మరియమ్మ కేసు విషయంలో కూడా తీవ్ర మోసం జరుగుతుందని మండిపడ్డారు. మరియమ్మ కేసు విషయంలో నష్టపరిహారం చెల్లిస్తానని ప్రకటించిన కేసీఆర్ అందుకు బాధ్యులపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులను రక్షించేందుకు మరియమ్మ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారని అన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.