- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే : మందకృష్ణ మాదిగ
దిశ, తెలంగాణ బ్యూరో : అనేక రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాయని, అధికార బీజేపీ బిల్లు పెడితే కాంగ్రెస్ కూడా మద్దతిచ్చే పరిస్థితి ఉందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు ఢిల్లీలో మాదిగ విద్యార్థి జాతీయ మహాసభను నిర్వహిస్తున్నారని తెలిపారు. వేల సంఖ్యలో విద్యార్థులు జాతీయ సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. మా పోరాటంలో ధర్మం, న్యాయం ఉందని నివేదికలు చెప్తున్నాయని అన్నారు.
రాజకీయ పార్టీలు ఉద్యమానికి మద్దతిస్తున్నాయి కానీ.. సమస్యను పరిష్కరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మౌనంగా ఉండటం వల్లనే మా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. మాలలు మా కన్నా శక్తివంతంగా ఉన్నారని, మాలల వెంట ఎవరు లేరని మాల నేతలు చెబుతున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాకు న్యాయం జరుగుతున్నదని భావిస్తున్నామని పేర్కొన్నారు.