- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తండ్రికి మంచు లక్ష్మీ పుట్టినరోజు కానుక

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. తన కూతురు లక్ష్మీ ప్రసన్న నుంచి విలువైన బహుమతి పొందారు. పుట్టిన రోజును పురస్కరించుకుని మామూలుగా ఐతే సెలబ్రిటీలు కార్లు, యాక్సెసరీస్ గిఫ్ట్‌గా ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ కొంచెం కొత్తగా ట్రై చేసిన లక్ష్మీ మంచు… తన తండ్రికి ఏకంగా సింహాసనాన్నే బహుమతిగా అందించింది. అంతే కాదు ఆ సింహాసనంపై ఉన్న మూడు సింహాలు.. లక్ష్మీ, విష్ణు, మనోజ్‌లకు ప్రతీకలుగా వెల్లడించింది. దీన్ని ప్రత్యేకంగా తానే చేయించిందని తెలిపింది.
‘పెదరాయుడు’గా తిరుగులేని ప్రేక్షకాదరణ పొందిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు… 520కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా కరోనా కారణంగా ఏటా వైభవంగా జరుపుకునే పుట్టినరోజు వేడుకలను వాయిదా వేశారు మోహన్ బాబు.
tags : Mohan Babu, Lakshmi Manchu, Birthday Gift