- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాన్నా.. మీ మిత్రుడు నా వైపే : మంచు లక్ష్మీ
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా భలే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. లేటెస్ట్‌గా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మెగా లెవల్ పంచ్‌లేస్తున్నారు. తనకు వెల్ కమ్ చెప్పిన సీనియర్, యంగ్ సెలబ్రిటీస్ అందరికీ తనదైన శైలిలో రిప్లై ఇచ్చిన చిరు…. మోహన్ బాబు విషయంలోనూ అదే చేశారు. మిత్రమా స్వాగతం అంటూ మోహన్ బాబు చిరంజీవిని ట్విట్టర్‌కు స్వాగతం పలకగా… థాంక్యూ మిత్రమా.. రాననుకున్నావా..? రాలేననుకున్నావా? అని రిప్లై ఇచ్చాడు. దీనిపై స్పందించిన కలెక్షన్ కింగ్… ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెప్తానంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా చిరు … మిత్రమా కరోనా రక్కసి కోరలు చాస్తున్న తరుణంలో మనలో మార్పు రావాలి.. నో హగ్స్… నో షేక్ హ్యాండ్స్.. నమస్తే మాత్రమే. సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి. మన తోటివారికి కరోనాపై అవగాహన తీసుకొద్దాం… మన లక్ష్మీ ప్రసన్న చేసిన వీడియో చూడు అని ట్వీట్ చేశాడు.
Megastar endorsing my video on virus awareness makes the reach wider and more effective. Naanna,, naa pakkana mee mitrudu unnaru.. our relation is now like fish and water…. @KChiruTweets https://t.co/GRovqKi9Jt
— Lakshmi Manchu (@LakshmiManchu) March 28, 2020
మెగాస్టార్ ట్వీట్‌పై సంతోషం వ్యక్తం చేసింది మంచు లక్ష్మీ. కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ చేసిన నా వీడియోను చిరు అంకుల్ చూడమని చెప్పడం మరింత ప్రభావితంగా ఉంటుందని తెలిపింది. నాన్నా… నా పక్కన మీ మిత్రుడు ఉన్నారు.. మా బంధం చేప, నీరు లాంటిదంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Tags : Chiranjeevi, Mohan Babu, Manchu Lakshmi Prasanna, Covid19, CoronaVirus