హనుమంతరావుకు క్షమాపణ చెప్పిన మానవతా రాయ్

by Anukaran |
vh
X

దిశ, అంబర్‌పేట్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావుతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ బుధవారం బాగ్‌అంబర్‌పేట్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. మానవతారాయ్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గతంలో క్రమశిక్షణ కమిటీకి తాను ఫిర్యాదు చేసినట్లు వీ.హెచ్ వివరించారు. క్రమశిక్షణ కమిటీ సూచన మేరకు మానవతారాయ్ వీ.హెచ్ ఇంటికి వెళ్లి ఆయనకు సన్మానం చేసి క్షమాపణ కోరారు. భవిష్యత్ రాజకీయాలలో వీ.హెచ్ ఆశీస్సులు ఉండాలని కోరినట్లు మానవతారాయ్ తెలిపారు. మానవతారాయ్‌కు రాజకీయంగా హనుమంతరావు పలు సూచనలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed