వ‌డ్డీదందా ఆరోప‌ణ‌లపై ఏపీజీవీబీ మేనేజర్ వివరణ

by Sumithra |
వ‌డ్డీదందా ఆరోప‌ణ‌లపై ఏపీజీవీబీ మేనేజర్ వివరణ
X

దిశ, వాజేడు: బ్యాంకు రుణాల మంజూరులో వ‌డ్డీ కోసం కొంత‌మంది బ్యాంకు ఉద్యోగులు అక్ర‌మంగా ఆర్థిక లావాదేవీలు నిర్వ‌హిస్తున్నారంటూ మీడియాలో క‌థ‌నాలు రావ‌డంపై వాజేడు ఏపీజీవీబీ మేనేజ‌ర్ అశోక్‌రెడ్డి స్పందించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. బ్యాంకు సిబ్బందిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విచార‌ణ చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని, ప్రాథ‌మిక విచార‌ణ‌లో అయితే అలాంటిందేమీ లేద‌ని తేలింద‌ని వివ‌రించారు.

అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లుగా భ‌విష్య‌త్‌లో తేలినా.. వారిపై బ్యాంకు నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. వినియోగ‌దారుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా బ్యాంకు ప‌నిచేస్తుంద‌ని అన్నారు.

Advertisement

Next Story