- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీ-షర్ట్స్ వేసుకుని గిన్నిస్ రికార్డు!
దిశ, వెబ్‌డెస్క్ : స్టైలిష్ స్టార్ అనగానే.. వెంటనే అల్లు అర్జున్ గుర్తొస్తాడు. కానీ, తన స్టైల్‌తో ఓ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ ప్యాంట్ మీద ప్యాంట్ వేస్తే.. ఎంతోమంది ఆ స్టైల్‌ను ఫాలో అయ్యారు. అంతేకాదు పలు సినిమాల్లో ఒంటిపై రెండు మూడు టీషర్టులు, షర్ట్‌లు కలిపి వేసుకుని చాలా ప్రయోగాలు చేశాడు. అయితే, ఇలా ఒక ప్యాంట్ మీద ప్యాంట్, టీ-షర్ట్ మీద షర్ట్ వేసుకోవడం కామనే కానీ.. ఓ వ్యక్తి ఏకంగా 260 టీ-షర్ట్స్ ధరించి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టడం విశేషం.
రికార్డులు ఊరికే వచ్చేస్తాయా? అంటే.. అందుకు తగిన ఆలోచనతో పాటు ఏదైనా చేసి రికార్డు కొట్టేయాలన్నా దృఢసంకల్పం కూడా ఉండాలి. అంతేకాదు ఒకరు చేసిందే చేస్తే కూడా అందులో కిక్కు ఉండదు. ఈ క్రమంలోనే టెడ్ హేస్టింగ్స్ అనే వ్యక్తి.. కాస్త కొత్తగా ఆలోచించాడు. ఒంటి మీద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 260 టీషర్టులు వేసి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాడు. అతడు ఈ ఫీట్‌ను 2019లోనే పూర్తిచేసినా, ఇటీవలే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టా పేజీలో ఈ వీడియోను పంచుకుంది. దాంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో హేస్టింగ్స్ ఒక్కో టీ-షర్ట్ వేసుకుంటుండగా, చుట్టూ ఉన్నవారు అతడికి సహాయం చేస్తుండటం కనిపించింది.
‘నా కొడుకు నన్ను ఏదైనా రికార్డు సాధించమన్నాడు. ఆ రికార్డు ఇప్పటివరకు ఎవరూ సాధించనిదై ఉండాలన్నాడు. అయితే, నా వారసులకు నేను కష్టపడేతత్వాన్ని, ఓ పని పట్ల మనకున్న కమిట్‌మెంట్‌ను ఈ రికార్డు ద్వారా తెలియజేయాలనుకున్నాను. అంతేకాదు, మన జీవితంలో.. ఏదో ఒకటి సాధించాలనే విషయాన్ని ఈ రికార్డు ద్వారా వారికి తెలిసివచ్చేలా చేశాను. ఈ రికార్డు ద్వారా వచ్చిన డబ్బులను ఓ స్కూల్ ప్లే గ్రౌండ్ నిర్మాణానికి వాడతాను’ అని హేస్టింగ్స్ తెలిపాడు.