- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖాళీ విమానంలో మారథాన్.. ఎవరి కోసం?
దిశ, వెబ్‌డెస్క్:
లాక్‌డౌన్ సమయంలో ఎన్నో వినూత్న ఐడియాలతో డబ్బులు సేకరించాలని స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ఓ 25 ఏళ్ల వ్యక్తి కూడా వినూత్నంగా ప్రయత్నించాడు. సాధారణంగా మారథాన్ అంటే ఒక గుంపుగా పరుగెడతారు. ఆ మారథాన్‌కు స్పాన్సర్‌ల ద్వారా వచ్చిన డబ్బును చారిటీకి విరాళంగా ఇస్తారు. కానీ కరోనా సమయంలో అలాంటి మారథాన్‌లు చేయడం కష్టం కదా.. అందుకే విమానంలో క్యాబిన్ క్రూ ఉద్యోగం చేసే హెన్నీ కేర్ కొత్తగా ప్రయత్నించాడు. ఆయన పనిచేస్తున్న విమానాన్నే తన మారథాన్‌కు దారిగా చేసుకున్నాడు. అలా చేసిన మారథాన్ ద్వారా సంపాదించిన విరాళాలను కేన్సర్ పేషెంట్‌ల కోసం విరాళంగా ఇచ్చాడు.
ఖాళీ విమానాన్ని 36000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి, అట్లాంటా నుంచి లండన్‌కు వెళ్లే క్రమంలో విమానంలో ఒక్కడే ఉండి, హాఫ్ మారథన్ పూర్తి చేశాడు. తన సహోద్యోగుల సహకారం, ఫిట్‌నెస్ మీద తనకున్న ఆసక్తి వల్లనే తాను ఇది పూర్తిచేయగలిగినట్లు హెన్రీ తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఎంతో ప్రభావితమైందని, ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అవసరం ఉందని హెన్రీ అన్నాడు. ఈ పాండమిక్ కారణంగా కేన్సర్ పేషెంట్లు మీద వైద్యులు పూర్తి స్థాయి శ్రద్ధ వహించలేకపోతున్నారని అందుకే వారికి అండగా ఉండటానికి తాను ఈ మారథాన్ చేసినట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం తన తల్లి కేన్సర్‌తో చనిపోయిందని, తాను విమానంలో మారథాన్ చేస్తుండగా ఆమెతో కలిసి పరుగెత్తుతున్న భావన కలిగిందని హెన్రీ చెప్పాడు. ఏదేమైనా సాయం చేయాలనే ఉద్దేశం ఉంటే ఏ రకంగానైనా విరాళాలు సేకరించవచ్చని హెన్రీ నిరూపించాడు.
View this post on InstagramA post shared by Henry (@henrykehr) on
Read also…