అవాయిడ్ టచింగ్ మెన్.. ఫాలో ఉమెన్

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా జాగ్రత్తలపై ఇప్పటికే బోలెడన్ని మీమ్స్, జోక్స్‌తో పాటు ఎన్నో పాటలు, షార్ట్ మూవీస్ కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఓ ట్విట్టర్ యూజర్ కరోనా జాగ్రత్తలను వివరిస్తూ పెట్టిన వినూత్నమైన పోస్ట్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల వెంటపడటం మనం చూస్తూనే ఉంటాం. ఆ అంశాన్నే కరోనాకు అన్వయించి ‘అవాయిడ్ టచింగ్ మెన్.. ఫాలో ఉమెన్’ అని ఫన్నీగా కోట్ చేశాడు. ఇది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్‌లాక్ దశలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు భారీగా ఆంక్షల్లో సడలింపులు ఇచ్చాయి. దీంతో ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన జనాలు ఎక్కువ సంఖ్యలో రోడ్ల మీదకొస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. కాగా, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌కు చెందిన ఓ విద్యార్థి చేసిన ట్వీట్ ‘అవాయిడ్ టచింగ్ మెన్.. ఫాలో ఉమెన్’ వైరల్‌గా మారింది.

ఇందులో మెన్ (Men) అంటే పురుషులు కాదు.. Men అంటే.. M-Mouth, E-Eyes, N-Nose. అందుకే అవాయిడ్ టచింగ్ మెన్ అని సంబోధించాడు. అంటే.. నోరు, కళ్లు, ముక్కును తాకొద్దని అర్థం. ఇక ఫాలో ఉమెన్ ‘(Women) అంటే.. W-Wash Your Hands, O-Obey Social Distancing, M-Mask Up, E-Exercise and Eat Well, N-No Unnecessary Crowding. ఫాలో ఉమెన్ అంటే.. ఈ కొవిడ్ రూల్స్ తప్పక పాటించమని అర్థం. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్‌‌గా మారింది. ఆ విద్యార్థి క్రియేటివిటీకి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజమే.. చికిత్స కంటే నివారణే మేలు. జాగ్రత్తలు పాటిస్తే.. కరోనాను నివారించడం ఎంతో సులభం. ఆరోగ్యంగా ఉండండి. అలర్ట్‌గా ఉండండి.

Advertisement