- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Black Fungus: జనగామలో బ్లాక్ ఫంగస్ కలకలం.. వ్యక్తి మృతి
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలోని రఘునాథపల్లికి చెందిన ఓ వ్యక్తి ఫంగస్ బారినపడి మృతిచెందాడు.
వివరాల ప్రకారం.. మంగలిబండ తండాకు చెందిన ఓ వ్యక్తి 20 రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఆ తరువాత వైరస్ నుంచి కోలుకోగా.. కన్ను, దవడలకు వాపు వచ్చింది. దీంతో బాధితుడిని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు బ్లాక్ ఫంగస్ నిర్ధారణ కాగా సదరు వ్యక్తిని వైద్యులు గాంధీ ఆసుపత్రికి పంపించారు.
గాంధీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఆ వ్యక్తి మృతి చెందాడు. అయితే.. వారి ప్రాంతంలోనే మరో యువకుడిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించి.. వైద్య సేవలు అందిస్తున్నట్టు సమాచారం.