- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విషాదం.. పశువుల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి
దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బస్వాపూర్ గ్రామానికి చెందిన బాబూమియా(60) పశువులకు దోమలు కుట్టకుండా ఉండేందుకు గడ్డితో పొగ పెట్టాడు. అనంతరం గాలి బాగా వీచి పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పు అంటుకున్నది. గమనించిన బాబూమియా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్న గడ్డిమోపులు అతనిపై పడ్డాయి.
దీంతో ఆయన మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి బాబూమియాను చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయినా, పరిస్థితి విషమించి శనివారం మరణించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని స్థానిక ఎస్ఐ రాము తెలిపారు.