- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు.. గ్రామస్థుడు మృతి
దిశ, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అనుకోకుండా అటుగా వచ్చిన ఓ గ్రామస్థుడు మృతి చెందాడు. ఈ ఘటన బీజాపూర్ జిల్లా మోదక్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఓతకల్పాడా అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. అదే సమయంలో ఓ చప్టా మీదికి ఓతకల్పాడా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రావడంతో వారికీ బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భద్రతా సిబ్బంది క్షతగాత్రుడిని హుటాహుటిన జిల్లా వైద్యశాలకు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్టు బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు.
Tags: encounter, chhattisgarh, bijapur district, man dead