మిస్టరీ : నిద్రపోతున్న వ్యక్తిని లేపిమరీ హత్య చేసింది ఎవరు..?

by Sumithra |
Man brutally murdered
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రస్తున్న వ్యక్తిని లేపి మరీ దుండగుడు అతికిరాతంగా అంతమొందించారు. నేరెడ్‌మెట్ లోని అనంతనగర్ లో ఈ దారుణం ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

శ్యామ్ సుందర్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి డోర్ కొట్టాడు. నిద్రమత్తులోనే వెళ్లి శ్యామ్ సుందర్ డోర్ తీశాడు. ఆ సమయంలో శ్యామ్ తో దుండగుడి మధ్య వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో గుర్తు తెలియని వ్యక్తి పక్కనున్న సిమెంట్ ఇటుకతో శ్యామ్ సుందర్ తలపై మోది హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారీ అయ్యాడు. హతుడి తల్లి రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, హత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. హంతకుడు పధకం ప్రకారమే వచ్చి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed